బోథ్ నియోజక వర్గం లో హస్తం దే... హావ.
By
Rathnakar Darshanala
ఆదిలాబాద్ జిల్లా నేటి వార్త : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ దే హావ కొనసాగుతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రెండా లిస్ట్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా బోథ్ నియోజక వర్గం లో వన్నెల అశోక్ కు టికెట్ దక్కిన విషయం తెలిసిందే.
అయన ఆదివారం తన ప్రచారం తాంసీ మండలం లోని పొన్నారి నుండి ప్రచారం ప్రారంభించారు. మొదట పొన్నారి హనుమాన్ ఆలయం లో ప్రత్యేక పూజలు చేసి కార్య కర్తలతో ప్రచారాని ప్రారంభించారు.
పొన్నారి లో కాంగ్రెస్ కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు. ఒక్కసారి గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నారి కి వస్తున్నారు అని తెలియగానే మహిళలు పెద్ద ఎత్తున ఆయనకు మంగళ హారతితో స్వాగతం పలికారు.
స్థానిక హనుమాన్ ఆలయం నుండి స్కూల్ వరకు మహిళలు పెద్దవారు ఆయనకు బాజా భజన్త్రీలతో స్వాగతం పలికారు. జై కాంగ్రెస్ అనే నినాదలు హోరేత్తాయి. పొన్నారి యువకులు భారీగా బైక్ ర్యాలీ లో పాల్గొని కాంగ్రెస్ కు జై కొట్టారు .
ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వన్నెల అశోక్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని టిఆర్ఎస్ బిజెపి మాటలు నమ్మవద్దని తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు వారికి అవకాశం ఇచ్చామని ఒక్కసారి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చి చూడండి అని కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత ఒక కాంగ్రెస్ ప్రభుత్వం దేనని ఆ ఘనత సోనియాగాంధీ కే దక్కుతుంది అని ఈ సందర్భంగా మరో మరు అయన గుర్తు చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
Comments