బీఅర్ ఎస్ పథకాలను ప్రజలకు వివరిస్తున్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్.

Rathnakar Darshanala
బీఅర్ ఎస్  పార్టీ పథకాలను ప్రజలకు వివరిస్తున్న మున్సిపల్ చేర్మెన్..
ఆదిలాబాద్ నేటి వార్త :
కర్ణాటక రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమయిందని, బూటకపు హామీలను ఇచ్చి మభ్యపెట్టే ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాటం చెప్తారని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం స్థానిక 33 వ వార్డు పరిధిలోని శాంతి నగర్ లో ఆయన విస్తృతంగా పర్యటించారు. వార్డులోని ఇంటింటికి తిరుగుతూ...    కారు గుర్తు పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యే జోగురామన్న ను భారి మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పతకాలను వివరించడంతో పాటు బీ.ఆర్.ఎస్ మానిఫెస్టో లో పొందుపరిచిన హామీలను వివరించారు. ప్రచారంలో కలిసిన వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

        ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ అలాల్ అజయ్, అడప తిరుపతి, ఇబ్బు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ మాట్లాడుతూ... ప్రజా శ్రేయస్సే పరమావధిగా బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని స్పష్టం చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ బుట్టదాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బూటకపు హామీల కాంగ్రెస్ కు తగిన గుణపాటం చెప్పనున్నారని స్పష్టం చేశారు.

       రైతులకు సైతం మూడు గంటల విద్యుత్తు సరిపోతుందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు... ఆ పార్టీ విధానాలకు నిదర్శనమని అన్నారు. అదేవిధంగా బీ.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్ మాట్లాడుతూ... అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న బీ.ఆర్.ఎస్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
Comments