బతుకమ్మ చీరలను పంపిణి చేసిన తాంసీ వైస్ ఎంపీపీ రేఖ.
By
Rathnakar Darshanala
బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన తాంసీ వైస్ ఎంపీపీ.
తాంసీ మండలంలోని పొన్నారి లో గురువారం బీఅర్ ఎస్ నాయకులతో కలిసి స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో బతుకమ్మ చీరలను ఆడపడుచులకు అందచేసిన వైస్ ఎంపీపీ రేఖ.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలో పంపిణీ కార్యక్రమం ఎంతో గొప్ప విషయమని అన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ గారి నాయకత్వానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వారి వెంట స్థానిక సర్పంచ్ అశోక్.ఉప సర్పంచ్ నరేందర్.మాజీ ఎంపీటీసీ విలాస్. గంధం రమణ. మాజీ ఉపసర్పంచ్ దేవేందర్. రమేష్ చిన్నయ్య. మల్లయ్య. ఎల్లన్న. ఉషాన్న. గంగన్న.అరుణ్. రఘు. తదితరులు ఉన్నారు.
Comments