రైతులకు ఉచిత కరెంట్ సరఫరాలో బీఅర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం. రూపేష్ రెడ్డి.
By
Rathnakar Darshanala
*24 గంటల కరెంట్ సరఫరాలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం....*
*యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి.....*
వ్యవసాయ రంగానికి 24 గంటల,ప్రజలకు నిరంతర కరెంటు ఇస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ఆరోపించారు.తరచూ విద్యుత్ సమస్యతో బేల మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో
బేల మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.అనంతరం ఏఈ సంతోష్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ మేరకు సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ సమయపాలన లేకుండా ఇష్టారాజ్యంగా విద్యుత్ కోత విధిస్తుండడంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారన్నారు.
నిన్న సాయంత్రం 7:00 గంటలు విద్యుత్ సరఫరా లేకపోవడంతో దేవి నవరాత్రి ఉత్సవాల సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని,చీకట్లోనే దేవికి పూజలు నిర్వహించారని గుర్తు చేశారు.33/11 మెయిన్ లైన్స్ లో సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లక్ష్మీపూర్ నుంచి బేల వరకు వచ్చే లైన్ లో స్పెషల్ డ్రైవ్ తో మరమ్మత్తులు చేపట్టాలన్నారు.సమస్య వచ్చినప్పుడు గంటల తరబడి రాత్రి వేళలో మరమ్మత్తులు చేసే బదులు ముందే సర్వే చేయించాలని సూచించారు.
దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ముందు జాగ్రత్త తీసుకున్న వారవుతారని తెలిపారు.బేల మండల కేంద్రంలో ఇస్తారాజ్యంగా ఏల్.సీలు తీసుకోవడంతో వ్యాపారులు,ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ప్రతి అధికారులు ఫోన్ పని చేసేలా చర్యలు తీసుకోవాలని,కానీ
అధికారులు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఎవరికి చెప్పాలో తెలియడం లేదన్నారు.విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ డిస్టిక్ జనరల్ సెక్రెటరీ ఎండి అఖిల్,యువజన కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ విపిన్,యువజన కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాపురావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కన్య రాజు,యువజన కాంగ్రెస్ నాయకులు శివ,కోడప విలాస్,తదితరులు పాల్గొన్నారు.
Comments