సాప కింద నీరు లాగా సోమవారపు సత్యనారాయణ ప్రచారం.
By
Rathnakar Darshanala
సాప కింద నీరు లాగా సోమవరపు సత్యనారాయణ ప్రచారం.
ప్రధాన పార్టీల్లో గూబులు.
* స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మధ్య పోటీ. రామగుండంలో మారిన రాజకీయ సమీకరణాలు
నేటి వార్త ప్రతినిధి చిన్న రామగుండం నియోజకవర్గo అక్టోబర్ 17
రామగుండం రాజకీయాలు రోజు రోజుకి మలుపు తిరుగుతున్నాయి రామగుండంలో నిన్న మొన్నటి వరకు భారసా అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ అనుకున్న రీతిగా ఉంది, కానీ మాజీ టిఎస్ఆర్టిసి చైర్మన్ రెండు పర్యాయాలు రామగుండం ఎమ్మెల్యే ఒక పర్యాయం మున్సిపల్ చైర్మన్గా చేసిన సోమవరపు సత్యనారాయణ ఎంట్రీ తీసుకున్న తర్వాత రామగుండం రాజకీయాల్లో మార్పు సంభవించింది,
ఇదిలా ఉండగా కాంగ్రెస్ లో బరసా చెందిన చెందిన కార్పొరేటర్లు మరో టీబీజికేస్ నాయకుడు కాంగ్రెస్లో చేరడంతో కాంగ్రెస్లో ఊపు వచ్చింది, రామగుండం రాజకీయాల్లో మార్పు వచ్చింది, మక్కాన్సింగ్ సోమారపు సత్యనారాయణ మధ్య పోటీ ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు,
ఏ కోణంలో చూసిన రామగుండంలో స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉండే అవకాశం కనిపిస్తుంది, మొట్టమొదటి నుంచి రామగుండం రాజకీయాలు స్వతంత్ర అభ్యర్థుల పైనే ఆధారపడి ఉండటంతో స్వతంత్ర అభ్యర్థులకే రామగుండం ప్రజలు పట్టం కడతారని సోమవారం మాజీ టిఎస్ఆర్టిసి చైర్మన్ చేసిన భారీ ర్యాలీ స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలను చూసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు,
పరిశీలకుల్లో సైతం రామగుండం రాజకీయాల్లో గతంలోకి ఇప్పటికి పూర్తి మార్పు వచ్చిందని కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ సోమవరపు సత్యనారాయణ మధ్య పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు,
రామగుండంలో బారాసా నుంచి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య వ్యక్తులు చేరడంతో కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చిందని ప్రజలతోపాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు,
శ్రీధర్ బాబు సమక్షంలో ఇద్దరు కార్పొరేటర్లు మరో టీబీజీకే నాయకుడు కాంగ్రెస్లో చేరడంతో భారత రాష్ట్ర సమితి పార్టీకి తీరని దెబ్బ తగిలిందని ఇది మూడో ప్లేస్ కి చేరిందని పలువురు అనుకుంటున్నారు, సోమవారం సత్యనారాయణ కున్న ఇమేజ్ అంతా కాదు మొదటి మున్సిపాలిటీగా మారిన తర్వాత ఆయనే చైర్మన్ రెండో పర్యాయం ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి రామగుండం జనరల్ గా పాడిన తర్వాత ఆయనే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మరోసారి టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇలా మూడు పర్యాయాలు ఒక ఇంజనీర్ గా ఈ ప్రాంతంలో గుర్తింపు ఉన్న సోమారపు సత్యనారాయణకు ప్రజలు పట్టం కట్టారు,
అదే రీతిలో మరి తిరిగి చివరిసారి పోటీ చేస్తున్నానని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోనూ ఉన్నానని ఆయన చెప్పడంతో స్వచ్ఛందంగానే ప్రజలు వేలాదిమందిగా తరలివచ్చి మహిళలు కార్మికులు కర్షకులు భారీ ర్యాలీ నిర్వహించారు, దీంతో రామగుండం రాజకీయ సమీకరణాలు మారిపోయాయి నిన్న మొన్నటి వరకు బారాస స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ అనుకున్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి కూడా ఊపు అందుకోవడంతో బారాస నుంచి చేరికలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థికి మధ్య పోటీ ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు, మరికొంతమంది కార్పొరేటర్లు కూడా త్వరలో బారాస నుండి కాంగ్రెస్లో చేరనున్నారు అని సంకేతాలు వస్తున్నాడంట కాంగ్రెస్ పార్టీ రామగుండంలో రాజీ లేకుండా ముందుకు పోతుంది,
ఏమైనా రామగుండం రాజకీయాల్లో కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ ఏర్పడిందని బారాస మూడో స్థానానికి చేరిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు, ఇది అంతా చూడాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే,
Comments