మహిళలకు అనుకూలంగా ఏంజెల్స్ లేడీస్ హాస్టల్.

Rathnakar Darshanala
మహిళలకు అనుకూలంగా ఏంజెల్స్ లేడీస్ హాస్టల్ 

కడప ప్రతినిధి, నేటి వార్త, అక్టోబర్ 08:

 కడప నగరం రమేష్ థియేటర్ ఎదురుగా ఉన్న  రాధాకృష్ణ నగర్ లో ఏంజెల్స్ లేడీస్ హాస్టల్ ను ఆదివారం గౌస్ కమ్యూనికేషన్స్ అధినేత గౌస్ భాష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీ సౌకర్యంతో పాటు ప్యూరిఫైడ్ కూల్ డ్రింకింగ్ వాటర్, స్నానాలకు వేడి నీళ్లు సౌకర్యం కూడా కలదన్నారు. రుచికరమైన వెజ్, నాన్ వెజ్ భోజనాలు, 24 గంటలు వైఫై తో పాటు, సీసీ కెమెరాల  పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎల్ఈడి టీవీ,  లాకర్, వాషింగ్ మిషన్ వంటి   అధునాతనమైన సౌకర్యాలు ఉన్నాయన్నారు. 2,3 అండ్ 5  షేరింగ్, ఒకరోజు స్టే , సదుపాయము  కూడా ఉందన్నారు. కడప జిల్లా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  చాంద్ బాషా, కమల్ భాష. అయేషా, సఫ్రీన్, ఎస్ ఎండి సోహెల్, ఆర్సియా, సాకీద్, సమద్, సుధా, జయదేవ్ రెడ్డి, కుమార్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments