అష్టాంగ యోగ శిక్షణ ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.....యోగా గురువు శ్రీ కోటి కలింగరాజు.
By
Rathnakar Darshanala
అష్టాంగ యోగ శిక్షణ ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.
....యోగా గురువు శ్రీ కోటి కలింగరాజు
నేటి వార్త జిల్లా ప్రతినిధి అదిలాబాదు
అష్టాంగ యోగం
అష్టాంగ యోగ శిక్షణ ద్వారానే అందరికీ ఆరోగ్యం ఆనందం మానసిక ప్రతిదాంతత ప్రశాంతత లభిస్తుందని యోగా గురువు శ్రీ కోటి కళింగరాజు అన్నారు
అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పీఎస్ గార్డెన్ శాంతినగర్ లో జరిగిన కార్యక్రమంలో ఆదివారం జరిగిన అష్టాంగ యోగ పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఎన్నోవేల మందికి అష్టాంగ యోగ సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని, ఉన్న జబ్బులు తగ్గించటమే కాకుండా భవిష్యత్తులో జబ్బులు రాకుండా చేయటమే ఆరోగ్యమని తమ మరియు తమ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రతిరోజు ఒక గంట కేటాయించి శరీరాన్ని రోగ విముక్తం చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
గురుముఖంగా చేసే ఈ సాధనలో శరీరంలో ప్రతి కణాన్ని శుద్ధి చేస్తూ అన్ని అవయవాలను ఆరోగ్యంగా పని చేయించే యోగ శిక్షణ కార్యక్రమం ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న ఈ అష్టాంగ యోగ తో తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని యోగాలోని ఆరోగ్య రహస్యాలు తెలుసుకుంటూ గురుముఖంగా యోగ సాధన చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మంచి ఫలితాలు తప్పనిసరిగా వస్తాయని అన్నారు.
ఉపయోగాలు
భవిష్యత్తులో ఎలాంటి జబ్బులు రాకుండా, ఉన్న జబ్బులు తొలగించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు ఎన్ని మందులు వాడినా తగ్గని అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఈ శిక్షణలో యోగ సాధన తో పాటు సంపూర్ణ ఆరోగ్యం కొరకు ఎలాంటి జబ్బులు నైనా తగ్గించే అన్ని రకాల విటమిన్లు ప్రోటీన్లు మినరల్స్ తో కూడిన పోషకాహారం ప్రతిరోజు ఇవ్వబడుతుందని తెలిపారు ఈ శిక్షణ లో పాల్గొన్న వారికి వ్యాధి నిరోధక శక్తి అందం యవ్వనం ముఖంలో తేజస్సు శరీరవ శుద్ధి శక్తినిచ్చే ప్రాణాయామం ఆధ్యాత్మిక ఎదుగుదల కలుగుతాయని ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆసనాలు సూర్య నమస్కారాలు వంటివి చేయిస్తారని ఆయన తెలిపారు పద్మశాలి సేవా సంఘం ఆదిలాబాద్ వారి సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆరోగ్య అభిలాష లందరూ పాల్గొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని శ్రీ కోటి కళింగరాజు గురూజీ కోరారు ఈనెల 9వ తేదీ నుండి పది రోజులపాటు జరగనున్న ఈ ఆరోగ్య శిక్షణ కార్యక్రమం ఉదయం బ్యాచి 5 గంటలకు సాయంత్రం బ్యాచ్ 6 గంటలకు ఉంటాయని స్త్రీలైనా పురుషులైనా రోజులో ఏదైనా ఒక బ్యాచ్ కి హాజరైతే చాలని తెలిపారు తాము సాధకులకు ఇచ్చే 20 రకాల అమృత ఆహారాలు తో తాము చేసే శంకు ప్రక్షాళన క్రియ వల్ల శరీరంలో ఉన్న మలినాలు పూర్తిగా తొలగిపోతాయని ఆయన తెలిపారు. ఆహుతులు తమతో పాటు తమ మిత్రుల్ని కుటుంబ సభ్యుల్ని కూడా ఈ పది రోజులు జరిగే యోగ క్లాసులకు తీసుకురావాలని ఆయన కోరారు వివరాలకు ఫోన్ నెంబరు 9396 267660 ను సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
Comments