అంతరాష్ట్ర హర్యానా గ్యాంగ్ దొంగల ముఠా అరెస్ట్.
By
Rathnakar Darshanala
అంతర్రాష్ట్ర హర్యానా గ్యాంగ్ దొంగల ముఠా అరెస్ట్:-*
*పిర్యాదు అందిన రోజుల వ్యవధిలోనే దొంగలను అరెస్టు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు..*
*వీరి వద్ద నుండి 2 లక్షల రూపాయల నగదు, 2 లారీలు, ఒక EECO కారు, రెండు నాటు తుపాకులు, ఒక గ్యాస్ గన్, 21 కేజీల గంజాయి, ఒక గ్యాస్ సిలిండర్, ఒక ఆక్సిజన్ సిలిండర్ లు స్వాధీనం.*
*పట్టుబడ్డ 6 మంది నిందితులు కరుడు గట్టిన హర్యానా కు చెందిన మేవాత్ గ్యాంగ్ నేరగాళ్లు గా గుర్తింపు..*
*అత్యాధునిక పరికరాలు ఉపయోగించి దొంగతనం చేసిన దొంగలు..*
విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి పి.పరమేశ్వర రెడ్డి ఐపిఎస్.,*
నేటి వార్త స్టేట్ బ్యూరో అక్టోబర్ 14
తిరుపతి జిల్లా, తిరుపతి రూరల్ మండలం, ధనలక్ష్మి నగర్ నందు, కెనరా బ్యాంక్ సమీపంలో వున్న స్టేట్ బ్యాంకు ఎటిఎం మిషన్ ను ఈనెల 12వ వ తేదతెల్లవారుజామున సుమారు 03:15 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ పరికరములను ఉపయోగించి అందులో రూ. 18,26,500/- రూపాయలను దొంగతనము చేయడంతో సంబందిత అధికారుల ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు
ఈ కేసును ఒక సవాలుగా తీసుకుని జిల్లా ఎస్పి పి.పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., ఆదేశాల మేరకు చంద్రగిరి డిఎస్పి యశ్వంత్ ఆధ్వర్యములో రెండు ప్రత్యేక బృందాలనుఏర్పాటు చేసి, తిరుపతి రూరల్ సిఐ సుబ్రమణ్యం రెడ్డి యొక్క బృందాన్ని ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు, చంద్రగిరి సిఐ రాజశేఖర్ యొక్క బృందాన్ని చేసి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు పంపడమైనదన్నారు.
కేసు దర్యాప్తులో సదరు బృందమునకు ఈ నేరము జరిగిన తీరు చూస్తే *హర్యానా రాష్ట్రానికి చెందిన మెవాత్ ప్రాంతమునకు చెందిన గ్యాంగుల* వారు చేసినట్లుగా ఉందని నిర్దారించినారు. ఈ క్రమము లో సదరు గ్యాంగు పలు రాష్ట్రాలలో ఏటీఎందొంగతనాలు చేసిన తీరును బట్టి అందులో ఒక గ్యాంగు ఈ నేరము చేసినట్టు నిర్దారించుకుని, వారి కోసం ఇన్ఫార్మర్లను నియమించి తిరిగి తిరుపతికి రావడమైనది. ఈ గ్యాంగులు దేశంలో చాలా రాష్ట్రాలలో చాలా నేరాలు చేశారని, వారి నేర ప్రవృత్తి కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని వారి కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నామన్నారు.
ఈ నేపథ్యంలో 12వ తేదీ సదరు నేరస్థుల యొక్క ముందస్తు సమాచారము మేరకు *తిరుపతి రూరల్ మండలము, గరుడాద్రి అపార్ట్మెంట్స్ ముందర* సదరు నేరస్థుల కదలికలు ఉన్నాయని తెలిసి అక్కడకు వెళ్ళి సదరు నేరము చేసిన గ్యాంగు అనగా సద్దాం ఖాన్, వసీమ్, సద్దాం ఖాన్ అన్నలు అర్షద్ ఖాన్, ఇర్షాద్ లను అరెస్టు చేసి ఒక కారును స్వాధీనము చేసుకుని, తదుపరి *తిరుపతి జిల్లా, రేణిగుంట మండలము, తిరుపతి-కడప రోడ్డు లో రంజిత్ ఢాబా ముందర,* ఇర్షాద్ ఖాన్@ అఫ్సర్ ఖాన్, నస్రుద్దీన్ @ నస్రు లను అరెస్టు చేసి వారి వద్ద నుండి చోరి సొత్తును, చోరికి చేయుటకు ఉపయోగించే పరికరాలను స్వాధీనము చేసుకున్నారు
*అరెస్ట్ అయిన ముద్దాయిలు*
A-1 సద్దాం ఖాన్,
A-4 వసీమ్,
A-5 అర్షద్ ఖాన్,
A-6 ముర్ సలీం,
A-7 ఇర్షాద్ @ అఫ్సర్ ఖాన్,
A-8 నసీరుద్దీన్ @ నస్రు.
*పరారీలో ఉన్న ముద్దాయిలు*
A-2 రహాడి సద్దాం,
A-3 అమీర్ ఖాన్.
*చోరీ సొత్తు వివరాలు*
1. Cash రూ. 2,00,000/-,
2. EECO కారు(తిరువళ్ళూరులో దొంగలించినది),
3.లారీ నెం.RJ-11-GC-0013 (చోరీ చేసిన నగదుతో కొన్నది),
4. గంజాయి ప్యాకెట్స్ –21 KGs నేరమునకు ఉపయోగించినవి,
5. లారీ నెం. RJ-40-GA-0867,
6. రెండు నాటు తుపాకులు,
7. గ్యాస్ గన్,
8. గ్యాస్ సిలిండర్,
9. ఆక్సిజన్ సిలిండర్.
ఈ గ్యాంగ్ సభ్యులు అందరూ హర్యానా రాష్ట్రమునకు చెందిన ఇర్షాద్ ఖాన్@ అఫ్సర్ ఖాన్, నస్రుద్దీన్ @ నస్రు అను వారి ప్రోద్బలంతో 1. సద్దాం ఖాన్, 2. వసీమ్, 3. అర్షద్ ఖాన్ మరియు 4. ముర్ సలీం మరియు పరారీ లో ఉన్న రహాడి సద్దాం, అమీర్ ఖాన్ లు కలిసి దొంగతనాలు చేసి ఇర్షాద్ ఖాన్@ అఫ్సర్ ఖాన్, నస్రుద్దీన్ @ నస్రు అను వార్లకు ఇవ్వగా అందరూ కలసి పంచుకునేవారని, సదరు దొంగతనములు చేసే క్రమంలో వారికి అడ్డుపడే పోలీసులు లేదా ప్రజలను బెదిరించాలనే ఉద్దేశ్యముతో రెండు నాటు తుపాకులను ఎల్లప్పుడూ వారి వెంట వుంచుకొనేవారన్నారు.
ఈ ముఠా లారీలో సరుకులను రవాణా చేస్తూ ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వస్తారు..ఆ క్రమంలో వారికి అనుకూలమైన ప్రదేశంలో దొంగతనాలు, దోపిడీలు చేసి వెళ్లిపోతారు. ఏదైనా గుర్తు తెలియని వాహనమును దొంగతనము చేసి వేరొక దొంగతనాలకు పాల్పడేవారు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ఆ వాహనాన్ని చుట్టుపక్కల ప్రదేశాలలో విడిచిపెట్టి తమ గూడ్స్ లారీలో దర్జాగా వారి రాష్ట్రము విడిచి వెళ్ళిపోయే వారన్నారు.
వీరు పోలీసులను దారి తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో తమిళనాడులోని తిరువల్లూరు నుంచి ఒక కారును దొంగతనం చేసుకొని తిరుపతికి వచ్చి ఇక్కడ ఏటీఎం దొంగతనం చేసుకొని, ఆ కారును కడపలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. కేసు దర్యాప్తులో మనకు ఆ కారు కడపలో ఉన్నట్లు గుర్తించి అక్కడ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏటీఎం మిషన్ ని కటింగ్ చేయడానికి సాధారణంగా గ్యాస్ గన్ ఉపయోగిస్తారు. అయితే వీరు సరికొత్తగా ఎల్పిజి గ్యాస్ తో పాటు ఆక్సిజన్ కలిపి వాడడం వలన కేవలం 5 నుంచి 10 నిమిషాల లోపల ఏటీఎం మిషన్ను కట్ చేసి, నగదును దొంగతనం చేస్తున్నారన్నారు.
వీరికి సంబంధపడి పరారీ లో ఉన్న A2.రహాడి సద్దాం పైన వివిధ రాష్ట్రాలలో 19 కేసులు నమోదు కాబడి, కోర్టులలో విచారణ దశలో ఉన్నవి, అదే విధంగా A1.సద్దాం ఖాన్ పైన కూడా వివిధ రాష్ట్రాలలో 23 కేసులు నమోదు కాబడి, ఇంతవరకు ఒకే ఒక్క కేసులో హర్యానా పోలీసు వారు హిమాచల్ ప్రదేశ్ లో అరెస్టు చేసి, తరువాత రెండు పోలీస్ స్టేషన్ల వారు PT వారెంట్ పైన కోర్టు నందు హాజరు పరచినారన్నారు.
గతంలో వీరు విజయనగరం, చింతామణి, చిక్కమగలూరు, తుమకూరు నగరాలలో ఏటీఎం నేరాలు చేసి తప్పించుకు తిరుగుతున్నట్లు తెలిసిందన్నారు.
వీరు కర్ణాటక, తమిళ నాడు వంటి దక్షిణాది రాష్ట్రాలలో తక్కువ రేటుకు గంజాయిని కొనుక్కొని వారి స్వరాష్ట్రములో ఎక్కువ రేటుకు అమ్ముకునే నేరము కూడా చేస్తున్నారని తమ ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు.
ఈ కేసును చేదించి, దొంగలను అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకోవడంలో విశేష కృషి చేసిన చంద్రగిరి డిఎస్పీ యశ్వంత్, సీఐలు సుబ్రహ్మణ్యం రెడ్డి,రాజశేఖర్, ఎస్సైలు జగన్నాథరెడ్డి, నాగేంద్రబాబు, ఏఎస్ఐలు రాఘవ, రాము, మహేంద్ర రెడ్డి, హెచ్ సిలు విశ్వనాథం, కిషోర్ కుమార్, పిసీలు గౌస్ ఆరిఫ్, శ్రీనివాసులు, పురంధర్, ఎం ప్రసాద్, ప్రభాకర్, ఎల్బి ప్రసాద్, మునిరత్నం, కార్తీక్, రమణారావు, రాజా, ఎంఎల్ నాయుడు, సుధీర్ కుమార్ రెడ్డి, నాగార్జున లను జిల్లా ఎస్పి పి.పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., అభినందించి ప్రశంసా పత్రాలను అందజేసి, రివార్డులను ప్రకటించారు.
Comments