ఎన్నికల నేపథ్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీస్ లు.
By
Rathnakar Darshanala
ఎన్నికల నేపథ్యంలో ముమ్మర పోలీసులు తనిఖీలు
*నేటి వార్త అక్టోబర్14*
*(బాల్కొండ నియోజికవర్గం ప్రతినిధి)**
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా మేండోర,ముప్కాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నల్లూర్ ,బుస్సాపూర్ గ్రామల్లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నల్లూర్ బుస్సాపూరు గ్రామల్లో ఆర్మూర్ ఏ సి పి జగదీష్ చందర్ అధ్యర్యంలో పోలీస్ ప్రత్యేక బృందాలతో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భగా ఏ సి పి జగదీష్ చందర్ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం రవాణా గురించి తనిఖీలు నిర్వహిస్తున్నామని 50 వేలకు మించి డబ్బు తరలిస్తే తగు పత్రాలు వెంటపెట్టుకోవాలని లేని యెడల ఆ డబ్బు స్వాధీనం చేసుకుంటామని ఇబ్బందులకు గురి కావద్దని హెచ్చరించారు ఎటువంటి అల్లర్లు సృష్టించిన నిబంధనలు ఉల్లగించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముప్కాల్ ఎస్ ఐ భాస్కర చారి మెండోర ఎస్ ఐ శ్రీనివాస్ యాదవ్ , స్థానిక పోలీస్ ప్రత్యేక బృందాలు పాల్గొన్నారు.
Comments