పెద్ద పల్లిలో కదిలిన విజ్జన్న సైన్యం.
By
Rathnakar Darshanala
పెద్దపల్లిలో కదిలిన విజ్జన్న సైన్యం.
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి అక్టోబర్ 15 అడిచెర్ల రమేష్
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతకుంట విజయ రమణారావు పేరు పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో నియోజకవర్గ పార్టీ నాయకులు జోష్ నింపింది.
ఆదివారం రోజున సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల నుంచి బైక్ ర్యాలీగా పెద్దపల్లి చేరుకున్న విజయ రమణారావు కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు బైక్ ర్యాలీతో పట్టణంలోని కమాన్ జెండా మెయిన్ రోడ్ మజీద్ అమర్ నగర్ ప్రగతి నగర్ మీదుగా భారీ ర్యాలీ సాగింది.
ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడారు సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం ప్రజలకు సేవలందించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు పెద్దపెల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమన్నారు.
వెంట నాయకులు శ్రీనివాస్ భూతగడ్డ సంపత్ సారయ్య గౌడ్ నూగిళ్ల మల్లయ్య మస్రత్ సుభాష్ రావు విజేందర్ రెడ్డి శంకర్ సురేష్ గౌడ్ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Comments