ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న.
By
Rathnakar Darshanala
ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జోగు రామన్న.
జై తెలంగాణ జై కెసిఆర్ నినాదాలతో మారుమోగిన జాతీయ రహదారి.
* గెలుపే లక్ష్యం గా ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచన.
ఆదిలాబాద్ నేటి వార్త :
బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పదిహేను నిమిషాల పాటు ఇంటింటికి చర్చ జరిపితే... విజయం నల్లేరుపై నడకేనని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైన వేళ... బీ.ఆర్.ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జోగురామన్న ఎన్నికల శంఖారావాన్ని పార్టీ నేతలతో కలిసి మంగళవారం ప్రారంభించారు . తనదైన శైలిలో ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించిన ఎమ్మెల్యే.... వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి భారి బైక్ ర్యాలిలో పాల్గొని... ప్రచార ఘట్టానికి నాంది పలికారు.
జందాపూర్ ఎక్స్ రోడ్ నుండి భోరజ్ వరకు మంగళవారం భారి ఎత్తున బైక్ ర్యాలి నిర్వహించగా.. వేలాదిగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ర్యాలిలో పాల్గొన్నారు. జై తెలంగన, జై జోగురామన్న నినాదాలతో జాతీయ రహదారి మారుమోగింది.
గులాబీ జెండాను చేతపట్టుకుని బైక్ ర్యాలిలో పాలు పంచుకున్న ఎమ్మెల్యే.. శ్రేణులను ఉత్సాహపరుస్తూ ప్రచార ఘట్టాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. దారిపొడవునా పార్టీ శ్రేణుల నినాదాలు, డీజే పాటలతో ఆ ప్రాంగణమంతా పండగ వాతావరణం కనిపించింది.
అనంతరం భోరజ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పాల్గొని... ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎండగట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ... పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడుపుతున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కిందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథ కాలను దాదాపు అరవై ఎనిమిది సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ హయంలో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించిన ఆయన.... వారి పతకాలను తాము కాపీ కొట్టామంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
సీఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాంగ్రెస్ మేనిఫెస్టో లో చేర్చిన మాట వాస్తవమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే.... వారి బూటకపు హామీలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. కర్ణాటకలో హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్.. ఇక్కడ మాత్రం మేనిఫెస్టో ను ఏవిధంగా అమలు చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చెల్లని రసీదుతో సమానమని, ఇంటర్నెట్ లోనూ ఆ పార్టీ వైఫల్యాలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
బీజేపీ పార్టీ గురించి చెప్పుకోడానికి ఏమీ లేదన్న ఆయన... ఆ పార్టీకి ప్రజలే తగిన గుణపాటం చెప్తారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ల హయంలో ప్రజలు ఎదుర్కున్న ఇబ్బందులను ఇప్పటికీ మర్చిపోలేదన్న ఎమ్మెల్యే... తెలంగాణలో ఆ పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశమే లేదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు రోకండ్ల రమేష్, పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు లింగారెడ్డి, యాసం నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments