నేడు ములుగు జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన.

Rathnakar Darshanala
*నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన ఖరార్* 
* ములుగు జిల్లాలో రాహుల్ గాంధీ.
* రామప్ప ఆలయం లో ప్రత్యేక పూజలు చేయనున్నారు రాహుల్ గాంధీ.
* అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు.

ములుగు : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజు కు దూకుడుని పెంచుతుంది, దీనిలో భాగంగా ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిచున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. నేటి నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగబోతోంది. ప్రణాళికలో భాగంగా నేటి నుంచి ఎన్నికల సమర శంఖం పూరించబోతోంది కాంగ్రెస్ .

ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ ప్రియాంక గాంధీ నేడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించునున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేడు సాయంత్రం 4 గంటల సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల మేనిఫెస్టోను శివుడి ముందు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. రాహుల్ గాంధీకి శివుడిపై విశ్వాసం ఉంది. శివుడిని దర్శించుకుని బస్సు యాత్ర మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది.

మొదటిరోజు ములుగు, భూపాలపల్లి పరిధిలో మహిళలతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు.

రెండో రోజు కరీంనగర్ జిల్లాలో, మూడో రోజు నిజామాబాద్ జిల్లాలో బస్సు యాత్రను రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ , కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సభలో భారీ సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు పాల్గొననున్నారు.
Comments