జగిత్యాల జిల్లాలో సై అంటే సై అంటున్న ప్రచార హోరు*
By
Rathnakar Darshanala
*జగిత్యాల జిల్లాలో సై అంటే సై అంటున్న ప్రచార హోరు*
*-ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు*
*-ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు*
*-హోరాహోరీగా జగిత్యాల జిల్లాలో ప్రచార హోరు*
*మరి జగిత్యాల జిల్లా ప్రజలు అధికార బీఆర్ఎస్ కా,కాంగ్రెస్కా, బిజెపి క,ఎవరికి పట్టం కడతారో ?*
నేటి వార్త జగిత్యాల జిల్లా :
జగిత్యాల జిల్లాలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతుంది.ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు తలమునకాలు అవుతున్నారు.
రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ముందుగానే ప్రకటించారు. జగిత్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉండగా జగిత్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ధర్మపురి సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కు టికెట్లు కేటాయించారు. కోరుట్ల మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ అభ్యర్తిత్వం మేరకు తన కుమారుడు కల్వకుంట్ల సంజయ్ కి టికెట్ కేటాయించారు.
బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుండి వారు ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుండి వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజల దృష్టికి తీసుకు వెళ్తున్నారు.
జగిత్యాల నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పేరు ముందుగానే ఖరారు కావడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ప్రచార నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను అమలు చేయు విధానాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే 6 గ్యారెంటీ పథకాల పేరుతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
ధర్మపురి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ కుమార్తె నందిని కార్యకర్తలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంత్రిగా ఈశ్వర్ చేసిన సేవలను ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కొప్పుల ఈశ్వర్ పై ఓటమి చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ జగిత్యాల డిసిసి అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు దాదాపు టికెట్ ఖరారు అయింది.
లక్ష్మణ్ కు జీవన్ రెడ్డి అండదండలు ఉండడం ధర్మపురి నియోజకవర్గంలో జీవన్ రెడ్డితో పలు కార్యక్రమాలు చేపట్టడం లక్ష్మణ్ కు కొంచెం కలిసొచ్చే అంశంగా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఇప్పటివరకు ప్రకటించకపోవడం ఆశావాహులు నామమాత్రంగా ప్రచారంలో మునుగుతున్నారు.
ఇక బిజెపి విషయన్నికి వస్తే మూడు నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థుల పేరు ఇప్పటివరకు ప్రకటించకపోవడం కానీ జగిత్యాలలో మాజీ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణికి పేరు అధిష్టానం దాదాపు ఖరారు అయినట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నారు.
శ్రావణి పార్టీలో పలు చేరికలు తన ప్రచార వ్యూహంపై పలు ప్రణాళికలు వేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తానికి జిల్లాలో అన్ని పార్టీల అభ్యర్థులను ప్రకటించినప్పుడు ప్రచార హోరు రసవత్తరంగా మారనుంది.
Comments