తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది, రామగుండంలోనూ పోటీలో ఉంటుంది

Rathnakar Darshanala

 తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది, రామగుండంలోనూ పోటీలో ఉంటుంది, నియోజకవర్గ ఇన్చార్జి మూల హరీష్ గౌడ్

neti vartha godavari kani


నేటి వార్త ప్రతినిధి రామగుండం నియోజకవర్గం అక్టోబర్ 4-2023 :
తెలంగాణ రాష్ట్రంలో 32 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని రామగుండంలో సైతం బరిలో ఉంటుందని రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మూల హరీష్ గౌడ్ పేర్కొన్నారు, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించబోతున్నారన్నారు, రామగుండం నియోజకవర్గం లో 18 వేల సభ్యత్వం జరిగిందన్నారు, రామగుండం అభ్యర్థి ఎవరు అనేది జనసేన అధినేత వారాయి వాహనంలో ప్రచార నిర్వహించేటప్పుడు ప్రకటిస్తారని ఆయన తెలిపారు, తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ సైతం ఇతర పార్టీలకు దీటుగా పోటీ ఇస్తుందని రామగుండంలో సైతం జనసేన గట్టి పోటీ ఇవ్వబోతుందని హరీష్ పేర్కొన్నారు, ఈ విలేకరుల సమావేశంలో ఏముర్ల రంజిత్ మోతే రవికాంత్ రాజశేఖర్ కనగంటి మంగ బాలరాజు అజయ్ మహేందర్ తదితరులున్నారు,

Comments