ముదిరాజ్ ఆత్మ గౌరవ సభ విజయవంతం చేద్దాం
అక్టోబర్ 8న పరేడ్ గ్రౌండ్లో ముదిరాజ్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి అక్టోబర్ 04 అడిచర్ల రమేష్:
పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్ లో నిర్వహించిన
ముదిరాజుల ఆత్మ గౌరవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న
రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ ఆత్మగౌరవ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు.కొలిపాక శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా నుండి ప్రతి గ్రామ గ్రామాన ఉన్న ముదిరాజ్ సైనికులు అంత కదలి రావాలి అలాగే ఈ ఎన్నికల్లో మన సత్తా ఏంటో చాటే సమయం వచ్చింది. మనల్ని తక్కువ చేసి చూసే రాజకీయ పార్టీలకు మన బలం ఏందో చూపెడదాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనవాడికి మన ఓటు వేసుకుందాం పెద్దపల్లి అసెంబ్లీ బడిలో నేను ఉంటున్నానుఆశీర్వాదించండి భారీ మెజార్టీగా గెలిపిస్తారని ఆశిస్తున్నాను మన ఓటు మనమే వేసుకుందాం మన సమస్యలని మనమే తీర్చుకుందాం అని కొలిపాక శ్రీనివాస్ అన్నారుఅనంతరం తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు చొప్పరి శంకర్ ని సన్మానించారుఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్లు సర్పంచులు ఎంపీటీసీలువార్డ్ మెంబర్లుముదిరాజ్ సంఘం సభ్యులు మత్స్య శాఖ అధ్యక్షులు, ముదిరాజులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

