ADB :రిమ్స్‌లో ఏసీ షార్ట్‌సర్క్యూట్ ఘటనపై జోగు రామన్న ఆరా.

Rathnakar Darshanala
రిమ్స్‌లో ఏసీ షార్ట్‌సర్క్యూట్ ఘటనపై జోగు రామన్న ఆరా.
పిల్లల వార్డులో భయాందోళన.. ఘటనపై సమగ్ర విచారణ జరపాలి.


నేటి వార్త ఆదిలాబాద్ :రిమ్స్ ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ఏసీ నుంచి అకస్మాత్తుగా షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం చోటుచేసుకోవడంతో భయాందోళన వాతావరణం నెలకొంది. 

విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి చేరుకుని పిల్లల వార్డును సందర్శించారు.

అక్కడి పరిస్థితులను పరిశీలించిన ఆయన వైద్యులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

పిల్లల పరిస్థితి, చికిత్స అందుతున్న విధానం, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవడం బాధాకరమన్నారు.

ఈ ఘటనలో ఒక చిన్నారి మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని జోగు రామన్న అన్నారు. మిగిలిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

రిమ్స్ వంటి కీలకమైన ప్రభుత్వ ఆస్పత్రిలో ఏసీలు, విద్యుత్ పరికరాల నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా అనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలోని ఏసీ వ్యవస్థ, విద్యుత్ పరికరాల నిర్వహణపై పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ లోపం  నిర్లక్ష్యం వీడే ఇకనైనా మెరుగైన ప్రమాణాలకు దుష్ట సాధించాలని డిమాండ్ చేశారు..

 ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా  ప్రభుత్వం స్పందించి మరుగైన వసతులు  ప్రమాణాల పట్ల పై దృష్టి సారించాలన్నారు.
Comments