ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు డాక్టర్ని కేటాయించండి.

Rathnakar Darshanala
ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు డాక్టర్ని కేటాయించండి..
 నేటి వార్త మల్లాపూర్:28సెప్టెంబర్ 2026: 

మండలంలో వెంకట్రావ్ పేట గ్రామంలో ఉన్న ఏకైక ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు డాక్టర్ని కేటాయించాలని సర్పంచ్ కనుమల వెంకటేష్.

 ప్రజావాణిలో అర్జీ పెట్టడం జరిగింది సర్పంచ్ మాట్లాడుతూ ఆసుపత్రి భవనం మరియు తగిన సదుపాయాలు ఉన్నప్పటికీ, వైద్యులు లేకపోవడం వల్ల మా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

సాధారణంగా ఆయుష్ (ఆయుర్వేద) వైద్యం దీర్ఘకాలిక వ్యాధులను (కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, మధుమేహం, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, 

నరాల బలహీనత వంటివి) ఎలాంటి దుష్ప్రభావాలు (Side effects) లేకుండా నయం చేయడంలో ఎంతో అద్భుతంగా పని చేస్తుందన్న విషయం విదితమే.

కానీ, మా గ్రామంలో వైద్య అధికారి లేని కారణంగా.. వృద్ధులు మరియు ఈ తరహా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు సరైన ఆయుర్వేద వైద్యం అందుబాటులో లేక ప్రైవేటు ఆసుపత్రులకు లేదా దూరప్రాంతాలకు వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లాల్సి వస్తోంది. 

దీంతో ఈ 'ఆయుష్ ఆరోగ్య మందిర్' సేవలు మాకు పూర్తిస్థాయిలో అందక నిరుపయోగంగా మారుతోంది.
కావున, దయచేసి కలెక్టర్ గారు మా గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి, 

వెంకట్రావుట్ ఆయుష్ ఆరోగ్య మందిర్‌కు తక్షణమే ఒక వైద్య అధికారిని నియమించగలరని సవినయంగా కోరుకుంటున్నాము.

ఒకవేళ పూర్తిస్థాయిలో వైద్య అధికారిని తక్షణమే నియమించడం సాధ్యం కాని పక్షంలో.. ప్రత్యామ్నాయంగా వారంలో కనీసం కొద్ది రోజులైనా వేరొక వైద్యుడిని డిప్యుటేషన్‌పై (Deputation) మా గ్రామానికి పంపించి, 

ఆయుర్వేద వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలరని మనవి చేస్తున్నాము.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, వృద్ధులకు ఈ సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తెలియజేస్తూన్న అని తెలిపారు.
Comments