ADB :నర్స్ ప్రమీల పరిస్థితి విషమం.. నిమ్స్‌కు తరలింపు.
By
Rathnakar Darshanala
ADB :నర్స్ ప్రమీల పరిస్థితి విషమం.. నిమ్స్‌కు తరలింపు.
ఆదిలాబాద్, నేటివార్త , సెప్టెంబర్ 27:
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకున్న పిల్లల వార్డు అగ్ని ప్రమాద సమయంలో చిన్నారులను కాపాడడంలో కీలకంగా వ్యవహరించిన స్టాఫ్ నర్స్ ప్రమీల పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అగ్ని ప్రమాదం సమయంలో పొగతో నిండిన వార్డులోకి వెళ్లి చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో ప్రమీల సాహసోపేతంగా విధులు నిర్వర్తించారు.
ఈ ఘటన అనంతరం గత వారం రోజులుగా ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఊపిరితిత్తుల్లో నీరు చేరడం,
రసాయనాల ప్రభావంతో ఇన్ఫెక్షన్ ఏర్పడటం, కాలేయంపై ప్రభావం పడటంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వైద్యులు తెలిపారు.
దీంతో మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు నిమ్స్‌కు తరలించారు.
ప్రమీలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిమ్స్ డైరెక్టర్‌తో ఆరోగ్యశాఖ మంత్రి ఫోన్‌లో మాట్లాడేలా చేసి, ప్రమీలకు మెరుగైన వైద్యం అందించాలని కోరినట్లు తెలిపారు.
అలాగే దళిత్ శక్తి ప్రోగ్రాం రాష్ట్ర కన్వీనర్ అగ్గిమల్ల గణేష్ రిమ్స్ డైరెక్టర్, డీఎంహెచ్‌ఓతో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments