ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు పోట్ట పెల్లి కె మండల ప్రాథమిక పాఠశాలలో సందడి,

Rathnakar Darshanala
ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు పోట్ట పెల్లి కె  మండల ప్రాథమిక పాఠశాలలో సందడి,
 నేటి వార్త సెప్టెంబర్3 : లక్ష్మణ్ చందా మండలంలోని పొట్ట పెలి కె గ్రామం లో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల ప్రాథమిక పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

పాఠశాల ఆవరణలో చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో ముస్తాబై సందడి చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నించారు. కృష్ణుడి బాల్య లీలలను గుర్తుచేస్తూ ఉపాధ్యాయులు పిల్లలకు కృష్ణాష్టమి విశిష్టతను తెలిపారు

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ  ఉపాధ్యాయులు నర్మదా, అంగన్వాడి సునీత విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారుల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments