వాసవి స్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు..
By
Rathnakar Darshanala
వాసవి స్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు..
పెద్దపల్లి, సెప్టెంబర్03,నేటివార్త రిపోర్టర్ బత్తిని అనిల్ కుమార్.
పెద్దపల్లిలోని పట్టణంలో ని వాసవి స్కూల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడి వేషధారణలో, బాలికలు గోపికల అలంకరణలో పాల్గొని సందడి చేశారు.
చిన్నారుల కృష్ణ, గోపికల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా విద్యార్థులకు శ్రీకృష్ణాష్టమి ప్రాముఖ్యత, శ్రీకృష్ణుడి జీవితం, ఆయన బోధించిన ధర్మం, సత్యం, నీతి, మంచి మార్గంలో నడవాల్సిన ఆవశ్యకత గురించి ఉపాధ్యాయులు వివరించారు.
పండుగల ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు విలువలను చిన్నారులకు పరిచయం చేయడం ఎంతో అవసరమని తెలిపారు.
విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని శ్రీకృష్ణుడి, గోపికల వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు.
పాఠ్యాంశాలతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను విద్యార్థులకు అందించడమే వాసవి స్కూల్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాసవి స్కూల్ చైర్మన్ పాంపాటి శ్రీకాంత్, ప్రిన్సిపల్ మానస, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments