Kadapa :జిల్లాలో నాలుగు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు:

Rathnakar Darshanala
Kadapa :జిల్లాలో నాలుగు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు: 
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ 

కడప కలెక్టరేట్  ఆగస్టు 21: (నేటి వార్త ) 

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రి య(ఎస్.ఐ.ఆర్.)లో భాగంగా ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార, నమోదు శిబిరా లు నిర్వహించాలని,

జిల్లా కలె క్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. 

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గద ర్శకాల మేరకు.. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ కార్యక్ర మాన్ని చేపట్టాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు.
ఈ నాలుగు రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికా రులు (బీఎల్‌ఓలు), రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉండనున్నారు. 

ముసాయిదా ఓటరు జాబితా లు, ఏఎస్‌డీడీ జాబితాలను పరిశీలించేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు, అవసరమైన దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిం చారు.

ముఖ్యంగా 18–19 ఏళ్ల యువ ఓటర్లను పెద్ద సంఖ్యలో నమోదు చేయడంతో పాటు, ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన పౌరులను ఓటర్లుగా చేర్చేందుకు ఈ ప్రత్యేక శిబిరాలను వినియో గించుకోవాలని కలెక్టర్ సూచిం చారు. 

అవసరమైన 6, 7, 8, 8ఏ దరఖాస్తు పత్రాలను పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచా లని ఆదేశించారు.ప్రత్యేక శిబిరాలపై జిల్లాస్థాయి నుంచి పోలింగ్ కేంద్రాల స్థాయి వరకు విస్తృత ప్రచారం నిర్వహిం చాల ని, ఇందుకోసం ప్రింట్, ఎలక్ట్రా నిక్ మాధ్యమాలతో పాటు స్థానికంగా ఇతర ప్రచార మార్గా లను కూడా వినియోగించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

శిబిరాల నిర్వహణను జిల్లా ఎన్నికల అధికారి స్వయంగా పర్యవేక్షిం చడంతో పాటు, ఎన్నికల అధి కారులు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. 

ప్రత్యేక శిబిరాల్లో బీఎల్‌ఓలు గైర్హాజరైతే తీవ్రంగా పరిగణించి సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సివుంటుందన్నారు.

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయి మ్స్, అభ్యంతరాల స్వీకర ణ కాలం కొనసాగుతున్నం దున అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కుని తమ పేరు ఓటరు జాబితా లో ఉందో లేదో పరిశీలించు కోవాలని సూచించారు.
Comments