ADB :మావల మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

Rathnakar Darshanala
మావల మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.
ఆదిలాబాద్ నేటివర్త :

 తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మావల మండలం లో లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను శుక్రవారం అందజేశారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పారదర్శకంగా, ఎలాంటి ఆలస్యం లేకుండా అందాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. 

ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ముత్యం రావు, ఎంపీవో నందిని, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ స్వప్న అడేల్లు, వార్డు సభ్యులు, కంట్రోల్ డీలర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ‎
Comments