Nirmal :నిజాయితీ చాటుకున్న నిర్మల్ డిపో కండక్టర్.

Rathnakar Darshanala
నిజాయితీ చాటుకున్న నిర్మల్ డిపో కండక్టర్
 నేటి వార్త నిర్మల్ జిల్లా ప్రతినిధి ఆగస్టు 21: విధి నిర్వహణలో నిజాయితీని చాటుకున్న నిర్మల్ డిపో కండక్టర్ భూలక్షి కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

ఖానాపూర్‌ నుంచి నిర్మల్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు తన పర్సును పోగొట్టుకుని బస్సు దిగిపోయాడు. పర్సులో రూ.6,200 నగదుతో పాటు ఫోన్ నంబర్ తదితర వివరాలు ఉన్నాయి.

బస్సులో పర్సును గుర్తించిన డ్యూటీ కండక్టర్ భూలక్షి దానిని తన వద్ద ఉంచుకోకుండా స్టేషన్ మేనేజర్ ఎన్. రాజశేఖర్‌కు అప్పగించారు. పర్సులో లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా ప్రయాణికుడిని సంప్రదించి, స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం పర్సును, అందులోని రూ.6,200 నగదును సదరు ప్రయాణికుడికి అప్పగించారు.

డబ్బుతో కూడిన పర్సును నిజాయితీగా తిరిగి అప్పగించిన కండక్టర్ భూలక్షి తీరును ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ ఎన్. రాజశేఖర్, డ్యూటీ కంట్రోలర్లు గంగన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments