Jagityala :బీజేపీ బలోపేతానికి కొత్త ఇన్‌చార్జులు.

Rathnakar Darshanala
బీజేపీ బలోపేతానికి కొత్త ఇన్‌చార్జులు.
రాయికల్ పట్టణానికి బోడుగం శ్రీకాంత్‌రెడ్డి.. మండలానికి కల్లెడ ధర్మపురి నియామకం

నేటివార్త రాయికల్, ఆగస్టు 26: బీజేపీని మండల స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు పట్టణ, మండల ఇన్‌చార్జులను నియమించారు. 

రాయికల్ పట్టణ ఇన్‌చార్జిగా బోడుగం శ్రీకాంత్‌రెడ్డి, మండల ఇన్‌చార్జిగా కల్లెడ ధర్మపురిలను నియమించారు.

పార్టీ సిద్ధాంతం, క్రమశిక్షణ, సేవాభావాన్ని ప్రతి కార్యకర్తలో మరింత బలోపేతం చేసే దిశగా ఈ నియామకాలు జరిగాయని నాయకులు తెలిపారు. 

మండలం నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని పటిష్టం చేసి ప్రజల్లో మరింత విస్తరించేందుకు కృషి చేయాలని సూచించారు. 

జగిత్యాల జిల్లా నుంచి తెలంగాణలో బీజేపీని బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ నియామకాలకు సహకరించిన జగిత్యాల జిల్లా ఇన్‌చార్జి బోగ శ్రావణికి నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. 

అప్పగించిన బాధ్యతలను పార్టీ బలోపేతానికి వినియోగిస్తామని నూతన ఇన్‌చార్జులు పేర్కొన్నారు.
Comments