ADB :మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలో వనమహోత్సవం.

Rathnakar Darshanala
ADB :మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలో వనమహోత్సవం.
ఆదిలాబాద్, నేటివార్త, ఆగస్టు 27: 

ఆదిలాబాద్ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పాల్గొని కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. 

విద్యార్థులు తమ పాఠశాలలు, కళాశాలలతో పాటు ఇళ్ల వద్ద కూడా మొక్కలు నాటాలని, పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో మొక్క నాటి సంరక్షించే అలవాటును అలవర్చుకోవాలని సూచించారు. 

వాతావరణ మార్పుల కారణంగా వర్షపాతం ప్రభావితమవుతున్న నేపథ్యంలో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ అధికారి డీఎండబ్ల్యూ కలీం, కళాశాల ప్రిన్సిపల్, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, అవి కిరణ్, శానిటేషన్ ఎస్ఐ శంకర్, 

మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు కౌన్సిలర్లు, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్, మున్సిపల్ అధికారులు, మైనార్టీ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ శాఖ అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments