సమస్యల సాధనకు మహాధర్నా.
By
Rathnakar Darshanala
సమస్యల సాధనకు మహాధర్నా.
:సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో పీఆర్టీయూ టీఎస్ ధర్నా
:రాయికల్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
నేటివార్త రాయికల్,ఆగస్టు 26: అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ,ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు బోయినపెళ్లి ఆనంద్‌రావు, ప్రధాన కార్యదర్శి యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు.
రాయికల్‌లో బుధవారం నిర్వహించిన పీఆర్టీయూ మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశంలో వారు మాట్లాడారు.
నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
*పదేళ్ల సేవలకు సన్మానం:*
రాయికల్ మండలంలో గత పది సంవత్సరాలుగా సంఘ బలోపేతానికి కృషి చేసిన మాజీ అధ్యక్షుడు రాపర్తి నర్సయ్యను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పొన్నం రమేష్, కుంబాల శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కన్నవేని మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గాజంగి రాజేశం, జాదవ్ వసంతరావు, రాజ్ మహమ్మద్, జగిత్యాల రూరల్ అధ్యక్షుడు రాచర్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
*నూతన కార్యవర్గం ఏకగ్రీవం*
పీఆర్టీయూ టీఎస్ రాయికల్ మండల అధ్యక్షుడిగా అంతడుపుల గంగారాజం, ప్రధాన కార్యదర్శిగా దొంతి సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా కడకుంట్ల అభయ్‌రాజ్, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా గుండేటి తరంగిణి ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా చిలివేరి రమేష్, గాజుల కిరణ్, మహిళా ఉపాధ్యక్షులుగా సంగర్తి శోభ, కొక్కుల సుజాత, కార్యదర్శులుగా నాంపల్లి హరికృష్ణ, ఏలేటి ప్రతాప్, మహిళా కార్యదర్శులుగా పర్లపల్లి స్వర్ణలత, పొన్నాల ప్రవళికలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Comments