కొత్తపల్లి రైల్వే గేటు మూసివేయవద్దు.

Rathnakar Darshanala
కొత్తపల్లి రైల్వే గేటు మూసివేయవద్దు.
ప్రత్యామ్నాయ మార్గం వచ్చే వరకు కొనసాగించాలని అధికారులకు వినతి.

తాండూర్, నేటివార్త, ఆగస్టు 21: తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రేపల్లెవాడ సెట్ థెరిసా హైస్కూల్ వద్ద ఉన్న 68 నెంబర్ గల రైల్వే గేటును మూసివేయవద్దని సర్పంచ్ ఆకుల వేంకటేశం తో కలిసి కొత్తపల్లి గ్రామస్థులు, రైతులు తహసిల్దార్ జోష్స్న, ఎంపిడిఓ శ్రీనివాస్‌ లకు వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపల్లి పరిధిలోని 68 నెంబర్ గల రైల్వే గేటు మూడు మండలాల ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, అత్యవసర సేవలకు ప్రధాన రాకపోకల మార్గంగా ఉందని వారు తెలిపారు. 

రైల్వే శాఖ నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి గేటు మూసివేయాలని భావిస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ, ప్రత్యామ్నాయ ఫ్లైఓవర్ మార్గం ఎక్కడ, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. 

ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో మండలంలోని ఐబీ సంత ఏరియా, పెట్రోల్ బంక్ ఏరియాలోని రెండు ప్రధాన బ్రిడ్జిలు మునిగిపోయి రాకపోకలు నిలిచిపోతాయని, 

అప్పుడు రేపల్లెవాడ గేటు మార్గమే ఏకైక ఆధారంగా ఉంటుందని పేర్కొన్నారు. అంబులెన్స్ అత్యవసర వైద్య సేవలకు ఆటంకం ఏర్పడుతుందని,స్కూల్ బస్సులు,సహా విద్యార్థుల రవాణాకు ఇబ్బంది, మండలంలోని పలు గ్రామాల మధ్య ప్రజల రాకపోకలకు అంతరాయం, రైతుల పశువుల మేతకు తరలింపుకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆసుపత్రులకు సకాలంలో చేరకపోవడంతో ప్రాణహాని ప్రమాదం. వ్యవసాయం, వాణిజ్య కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడతాయాన్నారు. కావున ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తయి ప్రజల రాకపోకలకు అనుకూలంగా మారే వరకు ప్రస్తుత రైల్వే గేటును మూసివేయకుండా కొనసాగించాలని, 

ఈ విషయంపై సంబంధిత రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. ప్రజల ప్రాణ భద్రత, అత్యవసర సేవలు, వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని అత్యవసరంగా పరిశీలించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. 

మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ మోమిన్ అలీ, ప్రధాన కార్యదర్శి కట్కాల మల్లేష్, యూత్ మాజీ అధ్యక్షుడు డేగ స్వామి,ఎరువోతు శ్రీనివాస్, ఎలుక శ్రీనివాస్, ఆకుల మొండి, దేవ నర్సయ్య, పెద్ది శంకర్,ఆకుల రజిని, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Comments