అదనపు కలెక్టర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్.

Rathnakar Darshanala
అదనపు కలెక్టర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్.
• అసోసియేషన్ సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు బాదం ప్రవీణ్

నేటి వార్త,ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ, సివిల్ సప్లై) మహేందర్ జీని ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా మహేందర్ జీకి పుష్పగుచ్ఛం అందజేసి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

ములుగు జిల్లా పరిపాలనలో అదనపు కలెక్టర్‌గా మహేందర్ జీ అందిస్తున్న సేవలను బాదం ప్రవీణ్ అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డీఎస్‌ఓ పైసల్ హుస్సేన్, డీఎం కృష్ణవేణి నాయక్, డీటీసీఎస్ విజయ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి సహోదరు రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమురవెల్లి హరినాథ్, ఉపాధ్యక్షులు రగోతం, సుదర్శన్ రెడ్డి, గౌరవ సలహాదారులు శ్రవణ్, 

అనిల్, సహాయ కార్యదర్శి భద్రయ్య తదితరులు పాల్గొని మహేందర్ జీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Comments