ADB :అంతర్రాష్ట్ర సైబర్ ముఠా అరెస్ట్.

Rathnakar Darshanala
అంతర్రాష్ట్ర సైబర్ ముఠా అరెస్ట్.
  

ఫ్రాంచైజీ పేరుతో రూ.3.5 కోట్ల మోసం

ఐదుగురు బిహార్ నిందితులు రిమాండ్

ఆదిలాబాద్, నేటివార్త, ఆగస్టు 21: దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న బిహార్‌కు చెందిన ఐదుగురు సైబర్ నేరగాళ్లను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ శుక్రవారం ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 

నేషనల్ ఫ్రటిలెజర్స్ ప్రయివేటు లిమిటెడ్ పేరుతో నకిలీ వెబ్‌సైట్, ఫ్రాంచైజీ ప్రకటనలు ఇచ్చి బాధితుల నుంచి ఆధార్, పాన్, బ్యాంకు వివరాలు సేకరించారు. 
ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు, లైసెన్స్ ఫీజు, సర్వీస్ ఫీజు పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. అదేవిధంగా బజాజ్ లోన్ పేరుతో కూడా మోసాలకు పాల్పడ్డారు. 

జైనథ్ మండలం మాండగడకు చెందిన అకునూరు గణేష్ నుంచి ఫ్రాంచైజీ పేరుతో రూ.3,85,725/- కాజేశారు. నిందితుల అబిషేక్ కుమార్, సౌరవ్, ఆశుతోష్ కుమార్,బబ్లూ, నిషు కుమార్, రితేష్ కుమార్, అభినాష్ కుమార్, వీరంతా బిహార్ నవాదా, నలందా జిల్లాలకు చెందినవారు. 

10 సెల్ ఫోన్లు, రూ.70,000 నగదు. నిందితుల బ్యాంకు ఖాతాలు, షేర్లలో ఉన్న రూ.8 లక్షలు జప్తు చేశారు. నిందితులపై దేశవ్యాప్తంగా 498 సైబర్ కేసులు, తెలంగాణలోనే 90 కేసులు ఉన్నాయి. 

ఇప్పటివరకు సుమారు రూ.3.5 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ ఆన్‌లైన్ ఫ్రాంచైజీలు, లోన్ల పేరుతో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని, అనుమానం వస్తే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఇందులో డిఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి. శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments