వరలక్ష్మీ వ్రతానికి పోటెత్తిన భక్తులు.

Rathnakar Darshanala
వరలక్ష్మీ వ్రతానికి పోటెత్తిన భక్తులు.
నేటివార్త రాయికల్,ఆగస్టు 21: 

రాయికల్ పట్టణ కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ లలితాంబిక శక్తిపీఠం ఆలయంలో శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.

వరలక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సామూహికంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. 

పసుపు, కుంకుమ, పూలు, పూజా సామగ్రితో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తుల ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 

భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందుతూ కుటుంబ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది.
Comments