ప్రజా దర్బార్‌లో ప్రజల సమస్యలు విన్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.

Rathnakar Darshanala
ప్రజా దర్బార్‌లో ప్రజల సమస్యలు విన్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.
నేటివార్త ,గిద్దలూరు, ఆగస్టు 21: 

గిద్దలూరులో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. 

నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, వారి సమస్యలను సానుకూలంగా విని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

సమస్యల పరిష్కారంలో సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజా దర్బార్‌కు వచ్చిన ప్రతి ఒక్కరితో సంతోషంగా మమేకమై, వారి ఇబ్బందులను తెలుసుకుంటూ భరోసా కల్పించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. 

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
Comments