తమకు విద్యాబుద్ధులు నేర్పిన ప్రిన్సిపాల్‌నే హతమార్చడం దారుణం.
By
Rathnakar Darshanala
తమకు విద్యాబుద్ధులు నేర్పిన ప్రిన్సిపాల్‌నే హతమార్చడం దారుణం.
నేటివార్త రాయికల్,ఆగస్టు 21: నల్గొండ జిల్లాలో ప్రిన్సిపాల్ శ్రీమతి రూపారెడ్డిని ఆమె వద్దే చదువుకున్న విద్యార్థులే దారుణంగా హత్య చేయడం అత్యంత విషాదకరమని ప్రగతి హైస్కూల్ ప్రిన్సిపాల్ బాలె శేఖర్ అన్నారు.
రూపారెడ్డి మృతికి సంతాపంగా ప్రగతి పాఠశాలలో ప్రార్థనా సమయంలో విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బాలే శేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, సంస్కారం, మానవతా విలువలను నేర్పేది ఉపాధ్యాయులేనని అన్నారు.
తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువునే విద్యార్థులు హతమార్చడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల్లో నైతిక విలువలు, గురువుల పట్ల గౌరవ భావం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
రూపారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన విద్యార్థులు, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments