సర్పంచ్ పాడె మోసిన మంత్రి సీతక్క.

Rathnakar Darshanala
సర్పంచ్ పాడె మోసిన మంత్రి సీతక్క.
- ఓటాయి సర్పంచ్ గట్టి రాములుకు మంత్రి సీతక్క నివాళి.

నేటివార్త,కొత్తగూడ: ఓటాయి గ్రామ సర్పంచ్ గట్టి రాములు గుండెపోటుతో మృతి చెందడంతో రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

శనివారం రాములు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి సీతక్క, అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియల్లో పాడె మోసి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

నిత్యం ప్రజా సేవలో ముందుండి గ్రామ అభివృద్ధికి కృషి చేసిన గట్టి రాములు మృతి బాధాకరమని మంత్రి సీతక్క అన్నారు. 

ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments