Adilabad :దేశీదారు మద్యం బాటిళ్లు పట్టివేత.

Rathnakar Darshanala
Adilabad :దేశీదారు మద్యం బాటిళ్లు పట్టివేత.
ప్రధాన నిందితుడు అరెస్ట్.. ఇద్దరిపై కేసు నమోదు

ఆదిలాబాద్, నేటివార్త, ఆగస్టు 22:

అక్రమంగా మహారాష్ట్ర నుంచి భీంసరి గ్రామానికి తరలిస్తున్న 1300 దేశీదారు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు. 

అయన తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం విశ్వసనీయ సమాచారం మేరకు మార్కెట్ యార్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా అనుమానాస్పద కారులో 13 బాక్సుల్లో, 1300 దేశీదారు బాటిళ్లు గుర్తించారు. 
రూ.1,28,700 విలువ ఉంటుందని తెలిపారు. నిందితుడు ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి గ్రామానికి చెందిన సిర్పురే జనార్ధన్ (48) మహారాష్ట్ర యవత్మాల్ జిల్లా చాంకా గ్రామానికి చెందిన గజానన్ రాములు బట్టిన్వార్ అలియాస్ గజ్జు వద్ద మద్యం కొనుగోలు చేసి అక్రమంగా తరలించి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. 

నిందితుడి వద్ద నుంచి 1300 బాటిళ్లు, ఒక కారు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మద్యం విక్రయించిన గజానన్‌ పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. 

నిందితులు సిర్పురే జనార్ధన్, అరెస్టు చేయాగా, గజానన్ పరారీలో ఉన్నాడు, అక్రమ మద్యం తరలింపును అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు విట్టల్, క్రాంతిలను జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు అఖిల్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments