ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తీవ్ర అన్యాయం.స్మశానానికి స్థలం కూడా లేదు అని చెంచుల ధర్నా.
By
Rathnakar Darshanala
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తీవ్ర అన్యాయం.స్మశానానికి స్థలం కూడా లేదు అని చెంచుల ధర్నా.
నేటి వార్త ఆగస్టు 22 :సోన్ మండలం. మాదాపూర్ గ్రామానికి చెందిన చెంచు కుటుంబాలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు. 40 ఏళ్లుగా ఆ గ్రామంలోనే స్థిర నివాసం ఉంటున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మాదాపూర్ గ్రామంలోని కొత్త మరియు పాత పాలకవర్గం పట్టించుకోని తీరు, శవాన్ని తీసుకెళ్లడానికి కనీస స్థలంలో పట్టించుకోని పాత పాలకవర్గం కొత్త పాలకవర్గం,
మాదాపూర్ లో నివసిస్తున్న సుమారు చెంచు కుటుంబాలు తరతరాలుగా అక్కడే ఉంటున్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ ఫలాలు అందలేదని వారు వాపోయారు.
ఇందిరమ్మ ఇళ్లలో వివక్ష: గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. అర్హులైన తమను పక్కన పెట్టి అనర్హులకు ఇళ్లు ఇస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
స్మశాన వాటిక కూడా లేదు: తమకు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి కనీసం స్మశాన వాటిక స్థలం కూడా కేటాయించలేదని, దీంతో శవాన్ని తీసుకెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కన్నీరు పెట్టుకున్నారు.
కలెక్టర్ స్పందించడం లేదు: ఈ సమస్యలపై తాము ఎన్నోసార్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగామని, పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని ఆవేదన చెందారు.
చివరకు చేసేదేమీ లేక తమ గోడును ప్రభుత్వానికి తెలియజేయడానికి ధర్నా బాట పట్టినట్లు చెంచు కుటుంబ పెద్దలు తెలిపారు. తమకు వెంటనే ఇళ్లు, స్మశాన వాటికకు స్థలం కేటాయించి న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Comments