దుబాయ్‌లో తెలుగు యువకుడి మిస్టరీ మృతి - ఇండియాకు రాని మృతదేహం.
By
Rathnakar Darshanala
దుబాయ్‌లో తెలుగు యువకుడి మిస్టరీ మృతి - ఇండియాకు రాని మృతదేహం.
నేటి వార్త ఆగస్టు 22 :
సోన్ మండల కేంద్రంలోని దుబాయ్‌లో ఉపాధి కోసం వెళ్లిన తెలుగు యువకుడు దుండగుల గంగయ్య (39) మృతి చెందారు. అయితే ఆయన మృతదేహం ఇప్పటివరకు ఇండియాకు రాలేదు, ఆచూకీ కూడా తెలియలేదు.
వివరాలు:
కీ॥శే॥ దుండగుల గంగయ్య గారు (జననం: 01-01-1986) దుబాయ్‌లో మిస్సింగ్ అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ది. 11-08-2026న మరణించినట్లు సమాచారం అందినా, అప్పటి నుండి మృతదేహం జాడ తెలియడం లేదు.
స్నేహానికి, ప్రేమానురాగాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన గంగయ్య లేరన్న వాస్తవం మా గుండెల్ని పిండేస్తోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంత లోకాలకు వెళ్లిన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించి, మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారి కుటుంబం చాలా దయనీయ స్థితిలో ఉంది, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చేతులు జోడించి తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు
Comments