శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం.

Rathnakar Darshanala
శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం.
నేటి వార్త ఆగస్టు 21 రామ్ మందిర్ ఏరియా కాశెట్టి శివ :

శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా గోదావరిఖనిలోని శ్రీ కోదండ రామాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 

భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు, వ్రతాలను ఆచరించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మహిళా భక్తులతో కిక్కిరిసింది. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న మహిళలు వరలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థించారు. 

వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.
కార్యక్రమంలో నిర్వాహకులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. సామూహికంగా నిర్వహించిన వరలక్ష్మీ వ్రతంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

శ్రావణమాసం సందర్భంగా నిర్వహించిన ఈ సామూహిక వ్రత కార్యక్రమానికి మహిళా భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.
Comments