ADB :పటిష్టమైన పోలీసింగ్ అమలు చేయాలి - జిల్లా ఎస్పీ.
By
Rathnakar Darshanala
పటిష్టమైన పోలీసింగ్ అమలు చేయాలి - జిల్లా ఎస్పీ.
బోథ్, నేటివార్త, ఆగస్టు 20:
వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గురువారం బోథ్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన సిబ్బంది పరేడ్, కిట్ సామగ్రి, రికార్డులు, కేసు ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి వారం పరేడ్ నిర్వహించాలని, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని, సీసీటీఎన్‌ఎస్‌లో పెండెన్సీ లేకుండా చూడాలని సూచించారు.
గ్రామాల్లో వి.పి.ఓ విధానం అమలు చేయాలని, గంజాయి, పేకాట, గుడుంబా వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు.
ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ తనిఖీలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్. జీవన్ రెడ్డి, బోథ్ సీఐ డి. గురుస్వామి, ఎస్ఐ వి. పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Comments