ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ.
By
Rathnakar Darshanala
ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ.
నేటివార్త, కంభం, ఆగష్టు 20 :
కంభం: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా కంభం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియదర్శిని ఆధ్వర్యంలో, తురుమెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులపై ప్రజలకు ఆరోగ్య విద్య ద్వారా అవగాహన కల్పించారు.
దోమలు వృద్ధి చెందకుండా పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమల నివారణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
దోమల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ, దోమల నివారణ చర్యలు చేపడతామని కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ శివ నాయక్, డాక్టర్ రమేష్, సీహెచ్‌ఓ తులసి ప్రసాద్, కంభం సబ్‌యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్‌వైజర్లు, టీబీ సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పురుషులు, మహిళా ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Comments