Jagityala :గంగమ్మ తల్లిని దర్శించుకున్న మైతాపూర్ వార్డు సభ్యులు.
By
Rathnakar Darshanala
గంగమ్మ తల్లిని దర్శించుకున్న మైతాపూర్ వార్డు సభ్యులు.
నేటివార్త // రాయికల్ జూన్ 6:
మండలంలోని రామాజిపేట గ్రామ చెరువు గట్టు వద్ద ఉన్న గంగమ్మ తల్లి దేవాలయంలో జరుగుతున్న గంగమ్మ కల్యాణ మహోత్సవంలో మైతాపూర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బుస గంగమల్లయ్య, అనుమల్ల రమ సత్యనారాయణ, ఎన్‌ఆర్‌ఐ మ్యాకల రాజేశం, పల్లికొండ రవికిరణ్, బొజ్జ శేఖర్, నారాయణ, నవీన్, నరేష్, మహేష్, శ్రీనివాస్, అరవింద్, ప్రసాద్, గోవర్ధన్, డిష్ రెడ్డి, రవి,జక్కుల సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Comments