ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రొడ్డ సాగర్ నియామకం.

Rathnakar Darshanala
ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రొడ్డ సాగర్ నియామకం.
ఆదిలాబాద్, నేటివార్త, జూన్ 05: 

ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా రొడ్డ సాగర్ నియమితులయ్యారు.

ఎస్సీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ సామాజిక సేవను ధ్యేయంగా తీసుకొని ఎన్నో సంవత్సరాలుగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, బాధితుల పక్షాన నిలబడి నిస్వార్థ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడు రొడ్డ సాగర్. 

జిల్లా వ్యాప్తంగా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి చేరుకొని ప్రజల తరఫున పోరాడే సామాజిక చైతన్యవంతుడిగా ఆయన సేవలు ప్రశంసనీయం. 

ప్రస్తుతం అనేక గ్రామాల్లో షెడ్యూల్ కులాల ప్రజలు విద్య, ఉపాధి, ఆరోగ్యం, గృహ వసతి, ప్రాథమిక సౌకర్యాల విషయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. 

ఈ సమస్యల పరిష్కారం కోసం సాగర్ మరింత అంకితభావంతో కృషి చేస్తారని ఆశిస్తున్నామని, ఆదిలాబాద్ జిల్లాలోని 59 షెడ్యూల్ కులాల ఐక్యతను బలోపేతం చేస్తూ, యువతకు విద్య, ఉపాధి, నాయకత్వం, వివిధ రంగాలలో అవకాశాలు 

కల్పించే దిశగా ఎస్సీ సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్ర స్థాయిలో ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దుతారని, ఆయన నాయకత్వంలో ఎస్సీ సంక్షేమ సంఘం మరింత అభివృద్ధి చెంది, సమాజానికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు.
Comments