రామచంద్రపూర్ గ్రామంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ.
By
Rathnakar Darshanala
రామచంద్రపూర్ గ్రామంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ.
నేటి వార్త న్యూస్, జూన్ 18 :
రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం, రామచంద్రపూర్ గ్రామంలో విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేసి, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంధం శ్రీనివాస్, ఉప సర్పంచ్ పొన్నాల నర్సింహులు, పంచాయతీ సెక్రటరీ ఈసరి లక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు హ్యూమరా జాబిన్, ఉపాధ్యాయురాలు శారదా పాల్గొన్నారు.
అధికారులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని,
పాఠ్య పుస్తకాలను జాగ్రత్తగా ఉపయోగించి విద్యలో ప్రతిభ కనబరచాలని కోరారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments