బీరన్న ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం.
By
Rathnakar Darshanala
బీరన్న ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం.
తాండూర్ // నేటి వార్త :
తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న బీరన్న దేవుడి ఆలయ నిర్మాణానికి బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎలుక రాంచందర్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
కొత్తపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ఆలయ నిర్మాణ పనులు చేపడుతుండడంతో కుర్మ కులస్తులందరూ కలిసి దాతల సహకారం కోరుతూ పనులను వేగవంతం చేస్తున్నారు.
బీరన్న పండుగలోపు గుడి నిర్మాణ పనులు పూర్తి చేయాలని కమిటీ సభ్యులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ,
భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం జరగడం సంతోషంగా ఉందని, తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పర్వతాలు, రాజేశం, శ్రీశైలం, రాజ్ కుమార్, గ్రామ యువకులు, కుర్మ కుల పెద్దలు పాల్గొన్నారు.
Comments