మార్కాపురంలో ట్రాఫిక్ పై ప్రజలకు పలు సూచనలు చేస్తున్న సీఐ అల్తాఫ్ హుస్సేన్.

Rathnakar Darshanala
మార్కాపురంలో ట్రాఫిక్ పై ప్రజలకు పలు సూచనలు చేస్తున్న సీఐ అల్తాఫ్ హుస్సేన్.
నేటివార్త స్వర్ణ, మార్కాపురం జిల్లా ఇంచార్జ్, మే 6

మార్కాపురం పట్టణంలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ అల్తాఫ్ హుస్సేన్, ఎస్సై విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన రహదారులు మరియు రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను సక్రమంగా నియంత్రించారు.

వాహనాల రాకపోకలు సులభంగా సాగేందుకు ట్రాఫిక్ క్లియరెన్స్ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.
 ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

అత్యవసర సేవలకు, ముఖ్యంగా అంబులెన్స్ రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments