రాయికల్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక.

Rathnakar Darshanala
రాయికల్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక.
నేటివార్త రాయికల్ ఏప్రిల్ 28:

రాయికల్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యులుగా మాజీ వార్డ్ మెంబర్ సుధవేణి లత, మాజీ కౌన్సిలర్ వల్లకొండ మహేష్,మైనార్టీ కోటాలో ఇర్ఫాన్ అలీ,ఇంతియాజ్ పర్వీన్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా వారికి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానం నిర్వహించారు.మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, వైస్ చైర్మన్ తురగ సౌజన్య శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. 

ప్రజాసేవలో మరింత బాధ్యతతో పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని నూతన కో-ఆప్షన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments