వరద ముప్పుపై అప్రమత్తం.. బ్లాక్ స్పాట్ల వద్ద కలెక్టర్ క్షేత్ర పరిశీలన.

Rathnakar Darshanala
వరద ముప్పుపై అప్రమత్తం.. బ్లాక్ స్పాట్ల వద్ద కలెక్టర్ క్షేత్ర పరిశీలన.
- నేరెడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల్లో పర్యటన
- నీటి నిల్వల ప్రాంతాలపై సమీక్ష
- రక్షణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం

నేటి వార్త ఆదిలాబాద్, ఏప్రిల్ 21 :ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం నేరెడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల్లోని వరద నీటి నిల్వల బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. ఉన్నతాధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.

ఈ సందర్భంగా నీరు నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి, భవిష్యత్తులో వరద ముప్పు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, నీటి పారుదల సదుపాయాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రమాదకర ప్రాంతాల్లో వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ పరిశీలనలో డిపిఓ రమేష్, డిఎల్పిఓ ఫణిందర్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, ట్రైబల్ ఈఈ తనాజీ, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఇంజినీరింగ్ విభాగ అధికారులు కూడా హాజరయ్యారు. 

జాతీయ రహదారి విభాగం ప్రతినిధులు, నిర్మాణ సంస్థల అధికారులు, స్థానిక సర్పంచ్లు ఈ పర్యటనలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాలపై సమగ్రంగా చర్చించారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా వరద ప్రభావాన్ని తగ్గించవచ్చని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Comments