మహిళా సాధికారతే ప్రభుత్వం ధ్యేయం.ఎమ్మెల్యే కన్నా.

Rathnakar Darshanala
మహిళా సాధికారతే ప్రభుత్వం ధ్యేయం.
ఎమ్మెల్యే కన్నా.

నేటి వార్త, సత్తెనపల్లి :

మహిళా సాధికారత సాధించటమే కూటమి ప్రభుత్వం ద్యేయమని సత్తెనపల్లి ఎమ్మెల్యే  కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. 

బుధవారం సత్తెనపల్లి పట్టణం తాలూక సెంటర్ లోమెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాయ్ రాస్తా ప్రారంభించిన  కన్నా,

 28స్వయం సహాయక సంఘాలకు నాలుగు కోట్ల ఏనబైలక్షల యాభై వేల రూపాయల చెక్కును మరియు మొదటి రెండవ మరియు మూడవ విడత వీధి విక్రయదారులకు పీఎంస్వానిధి పధకం కింద 

ముప్పై ఏడు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయలు, మరియు 100మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు ముద్ర యోజన మరియు స్వయం సిద్ద కింద రెండు కోట్ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్బంగా శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ  మాట్లాడుతూ..

ఆడబిడ్డలను అక్కా చెల్లమ్మలను సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వారి కాళ్లపై వాళ్లు సొంతంగా వ్యాపారాలను చేసుకుని ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయం.

మహిళా సాధికారత మహిళ స్వావలంబనను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేశారు
మహిళలు ఐదు రకాల బస్సుల్లో ఫ్రీ జర్నీ చేసే వెసులు బాటు.రోజు పనిచేసే మహిళలకు విద్యార్థినులకు చిన్నపాటి మహిళ ఉద్యోగస్తులకు ఉచిత బస్సు పథకం ద్వారా ప్రయాణ ఖర్చులు భారం తగ్గుతుంది.

మహిళలను మహాశక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం  అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తల్లికి వందనం,దీపం-2, స్త్రీ శక్తి పథకాల ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తోంది కూటమి ప్రభుత్వం.

 తల్లికి వందనం బాలికల విద్యకు ఎంతో ప్రోత్సాహకంగా నిలిచిన పథకం తల్లికి వందనం పేదరికంలో ఉన్న కుటుంబాలు బాలికలను ఉన్నతంగా చదివించాలని ఆలోచనలను ముఖ్యమంత్రి  చంద్రబాబు తల్లికి వందనం పథకం అమలు చేసి ఆడబిడ్డల చదువుకి అండగా నిలిచారు.

 దీపం పథకం ద్వారా మహిళలు వంటింటి కష్టాలను దూరం చేసింది కూటమి ప్రభుత్వం.దీపం పధకం ద్వారా ప్రతి కుటుంబానికి మూడు ఎల్పిజి సిలిండర్లు ఉచితంగా ఇవ్వటంతో మధ్యతరగతి కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గుతుంది.
ఆడబిడ్డ నిధి పి ఫోర్ కు అనుసంధానం చేసిన ఆడబిడ్డ నిధి పధకంతో పేద కుటుంబాల్లో ఉన్న మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది.
సొంతంగా వ్యాపారాలు స్వయం ఉపాధికి వెసులుబాటు కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పిన విధంగానే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  రాష్ట్ర ప్రజలకు భరోసాగా నిలిచారు.గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీలకు ఒకటో తేదీన వేతనాలు అందజేస్తున్నాం.
గ్రామైక్య మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీల ద్వారా మూడు లక్షల నుంచి 20 లక్షల వరకు మహిళలకు రుణాలు అందిస్తున్నాం.రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి రెండున్నర లక్షల మహిళలని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుంది

ఈ కార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు
Comments