నేను ఇప్పటికి బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్న.

Rathnakar Darshanala
నేను ఇప్పటికి బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్న.
*స్థానిక బిఆర్ఎస్ నాయకులు నాకు దూరంగా ఉన్నారు*

*బిఆర్ఎస్ ను ఎక్కడ విమర్శించ లేదు*

*జగిత్యాల అభివృద్ధి నాకు ముఖ్యం*
 
*కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తా*

నేటివార్త జగిత్యాల టౌన్ ఫిబ్రవరి 04  :

నేను ఇప్పటికి బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాని స్థానిక శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.

బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు  గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు అందరికీ బిల్లులు ఇప్పించాన్నాని వారిలో కొందరు నాకు వ్యతిరేకంగా కూడా ఎన్నికల్లో పనిచేశారన్నారు.

 సమీకృత మార్కెట్ ఖాళీగా ఉండటం వలన మాత్రమే ఆ కాంట్రాక్టర్ మెటీరియల్ పెట్టుకున్నారని
ప్రతి గ్రామంలో కాంట్రాక్టర్ లు ఏదో ఒకచోట తమ మెటీరియల్ నిల్వ చేసుకుంటారు కదా దీనికి పెద్ద రాద్ధాంతం అవసరం లేదని తెలిపారు.

మంచాల కృష్ణ పెట్రోల్ బంక్ విషయంలో అనవసరంగా నన్ను లాగుతున్నారు. అంతకన్నా ముందే కాంతి భవన్ నుండి నూర్ మసీదు వరకు రెసిడెన్షియల్ జోన్ గా ఉంది.

పాత బస్టాండ్ నుండి మిషన్ కంపౌండ్ వరకు కూడా రెసిడెన్షియల్ జోన్ మరి అక్కడ దుకాణ సముదాయాలు ఎవరి హయాంలో కట్టారు..? 

సీనియర్ నాయకులకు కేవలం మంచాల కృష్ణ బంకు మాత్రమే కనబడుతుంది.. కానీ నాకు ఇవన్నీ కనబడుతున్నాయి అలాగని నేను అందరినీ ఇబ్బంది పెట్టలేను..

యావర్ రోడ్డు విస్తరణ కోసం 100 ఫీట్ల కు అనుమతి తీసుకువచ్చాను మాస్టర్ ప్లాన్ విషయంలో ఎంత గొడవ జరిగింది మీ అందరికీ తెలుసన్నారు.

కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే నేను అహర్నిశలు కృషి చేస్తున్నాని
నేను బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాను నేను బి ఆర్ఎస్ఎమ్మెల్యే గానే కొనసాగుతున్నాను.

 కేవలం అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రిని కలిస్తే నేను పార్టీ మారాన్నాని స్థానిక బిఆర్ఎస్ నాయకులు నాపై దుష్ప్రచారం చేయడమే కాకుండా నా ఆసుపత్రి మరియు ఇంటిపై దాడులు చేశారని పేర్కొన్నారు. 

అయినా కూడా నేను ఏనాడు పార్టీ అధిష్టానాన్ని కానీ స్థానిక నాయకులని కానీ విమర్శించలేదు..
కేవలం అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిశాను ఇకపై కూడా కలుస్తాను నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. 

మంత్రులు కూడా సహకరిస్తున్నారు.. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 200 కోట్లు మంజూరు చేయించా..కోరుట్ల సిరిసిల్ల కరీంనగర్లో ఎక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేదు. 

నన్ను విమర్శిస్తున్నారని నేను తిరిగి విమర్శించలేను . నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు అభివృద్ధి కొరకు మాత్రమే ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నా కాబట్టి రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాం.

ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, సమిండ్ల  శ్రీనివాస్ పంబాల రాము కప్పల శ్రీకాంత్ దుమల రాజుకుమార్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments