ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యం మత్తులో వ్యక్తి నిద్ర – ప్రజల్లో ఆందోళన.

Rathnakar Darshanala
ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యం మత్తులో వ్యక్తి నిద్ర – ప్రజల్లో ఆందోళన.
నేటివార్త, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రం లోని స్థానిక ఎక్సైజ్ కార్యాలయం ముందు ఒక వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపై నిద్రిస్తున్న ఘటన కలకలం రేపింది.

కార్యాలయానికి ఎదురుగానే ఈ పరిస్థితి కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

మద్యం నియంత్రణ బాధ్యత ఉన్న శాఖ ఎదుటే ఇలాంటి దృశ్యం కనిపించడం అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఈ ఘటన మద్యం దుర్వినియోగం ఎంత తీవ్రమైందో మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.మరో చర్చించాల్సిన విషయం ఏంటంటే అదే సమయంలో ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ తప్పించి మరే ఇతర సిబ్బంది లేకపోవడం గమనార్హం.
Comments