Jagityala :న్యూ ఇయర్ పేరుతో ‘మద్యం మోత.
By
Rathnakar Darshanala
Jagityala :న్యూ ఇయర్ పేరుతో ‘మద్యం మోత.
*జగిత్యాల టాప్… రూ.8.70 కోట్లతో రికార్డు*
నేటివార్త జగిత్యాల బ్యూరో జనవరి 01:
న్యూ ఇయర్ సంబరాల పేరిట డిసెంబర్ 31న ఉమ్మడి కరీంనగర్ జిల్లా మద్యం మత్తులో మునిగిపోయింది. పల్లెల నుంచి పట్టణాల వరకు వైన్ షాపులు, బెల్ట్‌షాపులు కిటకిటలాడాయి.
ఒక్కరోజులోనే జిల్లావ్యాప్తంగా రూ.25.67 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది.జిల్లాల వారీగా చూస్తే జగిత్యాల జిల్లా రూ.8.70 కోట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత పెద్దపల్లి రూ.7.27 కోట్లు,
కరీంనగర్ రూ.7.20 కోట్లు,సిరిసిల్ల రూ.3.10 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి.న్యూ ఇయర్‌ను దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్ శాఖ ముందుగానే భారీగా మద్యం నిల్వలను జిల్లాలకు తరలించింది.
ఐఎంఎల్ డిపోల నుంచి లక్షల బాటిళ్లు సరఫరా కావడంతో వైన్ షాపులు, బార్‌లు రాత్రంతా జనంతో నిండిపోయాయి.
కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటినా క్యూలు చెదరకపోవడం గమనార్హం.ఎక్సైజ్ అధికారులు రూ.33.34 కోట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేసినా, వాస్తవంగా రూ.25.67 కోట్ల వద్దే పరిమితమయ్యాయి.
అయినా ఒక్కరోజులో ఇంత భారీగా మద్యం అమ్మడం సామాజికంగా ఆందోళన కలిగించే అంశంగా మారింది.ప్రత్యేకంగా జగిత్యాల జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి .
న్యూ ఇయర్ పేరిట కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని, మద్యం నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments